![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-7 తుదిదశకు చేరుకుంది. ఇక ఫైనల్ విజేత కోసం గత రెండు వారాల నుండి హౌస్ మేట్స్ కి ప్రేక్షకులు ఓట్లు వేస్తున్నారు. ఎట్టకేలకు ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. అయితే ఫైనల్ ఓటింగ్ రిజల్స్ట్ లో పల్లవి ప్రశాంత్ నెంబర్ వన్ ర్యాంకింగ్ లో ఉన్నాడు.
ఇక రెండవ స్థానం కోసం శివాజీ, అమర్ దీప్ ల మధ్య గంట గంటకి ఓటింగ్ శాతం మారుతూ వచ్చింది. అయితే ఫైనల్ గా కొన్ని ఓటింగ్ పోల్స్ లో శివాజీ రెండవ స్థానంలో ఉండగా మరికొన్ని పోల్స్ లో అమర్ దీప్ ఉన్నాడు. అయితే ఈ సీజన్-7 ఉల్టా పుల్టా కాబట్టి ఎవరికైనా ఛాన్స్ ఉండొచ్చని తెలుస్తోంది. ఇక మిగిలిన హౌస్ మేట్స్ లో ప్రతీ ఓటింగ్ లో యావర్ నాల్గవ స్థానంలో ఉన్నాడు. ప్రియాంక అయిదు, అంబటి అర్జున్ లాస్ట్ లో ఆరవ స్థానంలో ఉన్నాడు. హౌస్ ఉన్న ఆరుగురిలో ఫస్ట్ ఎలిమినేషన్ అయ్యేది అంబటి అర్జున్, ఆ తర్వాత ప్రియాంక అని కన్ఫమ్ అయింది. ఇక బిగ్ బాస్ గ్రాంఢ్ ఫినాలేకి మరోక్క రోజు మాత్రమే ఉండటంతో బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతవారం శోభాశెట్టి ఎలిమినేషన్ తర్వాత బాటమ్-2 లో ఉన్నవారిని బిగ్ బాస్ మొదట పంపిస్తారనే నమ్మకం ప్రేక్షకులకు కలిగింది. ఇదే నిజమైతే ఫస్ట్ అర్జున్, సెకెండ్ ప్రియాంక బయటకు వచ్చేస్తారు. ఇక టాప్-3 లో ప్రశాంత్, అమర్, శివాజీ ఉంటారనేది అందరికి తెలిసిందే. అయితే వీరిలో విజేత పల్లవి ప్రశాంత్ అని అన్నీ ఓటింగ్ పోల్స్ లో కన్ఫమ్ అయింది. ఇక రన్నరప్ లో శివాజీ, అమర్ దీప్ లలో ఎవరు అవుతారనేది సస్పెన్స్ గా మారింది. ఇక శనివారం, ఆదివారం నాడు జరిగే గ్రాంఢ్ ఫినాలేలో ఎన్నో సర్ ప్రైజ్ లు ఉండబోతున్నాయంటూ, ఎన్నో ఉల్టా పుల్టా ట్విస్ట్ లు ఉంటాయంటూ ప్రచారం సాగుతుండగా ఈ గ్రాంఢ్ ఫినాలే మరింత హాట్ ఫేవరేట్ గా నిలిచింది.

యావర్ జర్నీ వీడియో ఇంపాక్ట్ భారీగా ఉందని ఓట్లని బట్టి తెలుస్తుంది. గతనాలుగు రోజుల క్రితం యావర్ అయిదు, ఆరు స్థానాలలో ఉండగా .. జర్నీ వీడియో తర్వాత ఏకంగా నాల్గవ స్థానంలోకి వచ్చేశాడు. ఇక పల్లవి ప్రశాంత్ జర్నీ ఎంతోమందికి చేరిందని తెలుస్తుంది. ఈ వారం మొదటి రెండు రోజుల్లో పడిన ఓటింగ్ లో శివాజీ ఫస్ట్, ప్రశాంత్ సెకెండ్ ఉండగా.. ఏవీ బుధవారం టీవీలో ప్రసారం అవ్వగా అప్పటి నుండి శుక్రవారం ఓటింగ్ ముగిసే సమయం వరకు ప్రశాంత్ కి ఓటింగ్ భారీగా పడింది. పల్లవి ప్రశాంత్ క హాట్ స్టార్ ఓటింగ్ కంటే ఎక్కువగా మిస్ట్ కాల్ ఓటింగ్ పడినట్లు తెలుస్తుంది. అది కూడా చాలా గ్రామాల నుండి రైతుబిడ్డ గెలవాలని కోరుకొని ఓట్లు వేసినట్టు తెలుస్తుంది. దాంతో పాటుగా ఇన్ స్టాగ్రామ్, సోషల్ మీడియాలలో పల్లవి ప్రశాంత్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్లలో ఒక కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన ఏ కంటెస్టెంట్ కి ఇంత ఫ్యాన్ బేస్ ఏర్పడలేదనేది వాస్తవం. మరి ఈ సీజన్-7 విజేత ఎవరో తెలియాలంటే మరొక్క రోజు ఆగాల్సిందే.
![]() |
![]() |